వారి కుట్రలతోనే ఏపిలో రీపోలింగ్‌

Devineni Uma
Devineni Uma

అమరావతి: ఏపి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈరోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతు.. ఎన్నికలు జరిగిన 34 రోజుల తర్వాత చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశించిందంటే అది కేవలం బిజెపి, వైఎస్‌ఆర్‌సిపి కుట్రేనని ఆయన ఆరోపించారు. పోలింగ్‌ సమయంలోని కొన్ని చోట్ల ఈవీఎంల మరమ్మతుల కోసం 6 గంటల సమయం తీసుకున్నారని, ఒక ఈవీఎం స్థానంలో కొత్తది ఏర్పాటు చేయడానికి అంత సమయం అవసరమా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలని జగన్‌ కోట్ల రూపాయల ఖర్చుపెట్టారన్నారు.ఎన్నికల ఫలితాల అనంతరం దేశానికి కొత్త ప్రధాని రావడం ఖాయమని ఉమా అభిప్రాయపడ్డారు.


మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/