తిరుమ‌ల‌లో దేవాన్ష్ పుట్టిన‌రోజు

devansh birthday
devansh birthday


తిరుమల: ఏపి సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు నారా దేవాన్ష్‌ పుట్టిన రోజు సందర్భంగా గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సీఎం సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, మనుమడు దేవాన్ష్‌ కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికారు.
దేవాన్ష్‌ పుట్టిన రోజు సందర్బంగా అన్న ప్రసాద వితరణ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు 30 లక్షల రూపాయలను అన్నప్రసాదం ట్రస్టుకు పంపారు. దేవాన్ష్‌తో కలసి స్వామివారిని దర్శించుకున్న సీఎం సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి వెంగమాంబ అన్నప్రసాదం భవనానికి చేరుకుని
భక్తులకు వడ్డించారు.