ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంస పాలన

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజం

TDP President Chandra babu Naidu

Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంస పాలన నడుస్తోందని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. టిడిపి నేతలతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై ఎస్‌పిలు, కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వాలని ఆయన సూచించారు. బలవంతపు ఉపసంహరణలపై ఫిర్యాదు చేయాలన్నారు.

అవకాశవాదులకు పార్టీలో స్థానం లేదని, పార్టీ మారేవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన చెప్పారు. 16 నెలలు జైలులో ఉన్న ఎ1, ఎ2 నిందితులు ఈసీని నిందించడం హేయమని ఆయన అన్నారు.

కండిషన్‌ బెయిల్‌పై ఉన్న నిందుతులు రాజ్యాంగ వ్యవస్థ అధిపతిని దూషిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజాక్షేత్రం, న్యాయక్షేత్రంలో వీరికి గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/