విశాఖలో పర్యటిస్తున్న రాజ్‌నాథ్‌సింగ్‌

Rajnath Singh
Rajnath Singh

విశాఖపట్నం: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తొలిసారిగా విశాఖలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం ఢిల్లీ నుండి నుంచి ఐఎఎఫ్‌కి చెందిన ప్రత్యేక విమానంలో విశాఖలోని నౌకాదళ వైమానికి స్థావరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నౌకాదళాధిపతి అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌, తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ ఎకేజైన్‌ సహా ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం రాజ్‌నాథ్‌ సింగ్‌ నేవీ హెలికాప్టర్‌లో విహంగ వీక్షణం ద్వారా వివిధ యూనిట్లను పరిశీలించారు. ఈ సాయంత్రం నౌకాదళ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం విశాఖ రానున్న సీఎం జగన్‌ నేరుగా రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ కానున్నారు. అనంతరం నౌకాదళ అధికారుల విందులో ఇరువురూ పాల్గొననున్నారు.


తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/