ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభ0

శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు దర్శనం

Kanaka durga ammavaru

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దుర్గగుడి ఈవో సురేశ్‌బాబు దంపతులు, సీపీ ద్వారకాతిరుమలరావు దంపతులు తొలి పూజ నిర్వహించి ఉత్సవాలను ప్రారంభిం చారు. అక్టోబర్‌ 8 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగనున్నాయి. పది రోజులు అమ్మవారు పది అవతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలి రోజైన ఈరోజు అమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/