వైఎస్‌ఆర్‌సిపిలోకి దాడి, ఆయన తనయుడు

dadi veerabhadra rao, dadi ratnakar, jagan
dadi veerabhadra rao, dadi ratnakar, jagan


హైదరాబాద్‌: మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మళ్లీ వైఎస్‌ఆర్‌సిపిలో శనివారం చేరారు. ఈ ఉదయం లోటస్‌పాండ్‌లో జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌సిపి తీర్ధం పుచ్చుకున్నారు. ఆయన తనయుడు దాడి రత్నాకర్‌ కూడా తండ్రి బాటనే అనుసరించారు. దాడి రత్నాకర్‌ను అనకాపల్లి ఎంపి స్థానానికి అభ్యర్ధిగా బరిలోకి దించాలని వైఎస్‌ఆర్‌సిపి అధిష్టానం ప్రతిపాదన చేస్తుండగా, వీరు మాత్రం అసెంబ్లీ టికెట్‌ అడుగుతున్నట్లు తెలిసింది. వీరిద్దరిలో ఎవరోఒకరు ఎన్నికల బరిలో దిగడం ఖాయమని తెలుస్తుంది. 2014 ఎన్నికలకు ముందు దాడి వీరభద్రరావు టిడిపికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌సిపిలో చేరారు. తన చిరకాల ప్రత్యర్థి కొణతాల రామకృష్ణ టిడిపిలో చేరుతుండటంతో మళ్లీ దాడి వైఎస్‌ఆర్‌సిపిలో చేరాలని భావించారు. టిడిపి నుంచి అనకాపల్లి ఎంపిగా కొణతాల పోటీ చేయడం దాదాపుగా ఖరారైంది. అందుకే దాడి రత్నాకర్‌ను అదే స్థానం నుంచి బరిలోకి దింపాలని వైఎస్‌ఆర్‌సిపి భావిస్తుంది. మరోసారి వీరి మధ్య ఉత్కంఠ భరితమైన పోటీ ఉండబోతుంది.