బాబు పాలనలో మద్యం ఏరులై పారుతోంది!

CPM
CPM

బాబు పాలనలో మద్యం ఏరులై పారుతోంది!

సీపీఐ, సీపీఎం నేేతలు రామకృష్ణ, శ్రీనివాసరావు

ఉరవకొండ: చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని తద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డునపడి ఎందరో మహిళల పుస్తులతాళ్లు తెగుతున్నా ఆదాయం తప్ప ప్రజా శ్రేయస్సు ఈ ప్రభుత్వానికి పట్టడంలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు వాపోయారు. నూతన రాజకీయ ప్రత్యాన్మాయం కోసం సెప్టెంబర్‌ 15న విజయవాడలో సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన ‘మహాగర్జన విజయవంతం కోసం బుధవారం జిల్లా కేంద్రం నుండి ప్రారంభమైన బస్సుయాత్ర గురువారం సాయంత్రం ఆయా పార్టీల నాయకులతో కలిసి అనంతపురం జిల్లా ఉరవకొండకు చేరుకోగా స్థానిక ప్రైవేటు బస్టాండ్‌ ఆవరణంలో బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామక్రిష్ణ మాట్లాడుతూ గతంలో పాలకులు చేసిన తప్పునే మరొకమారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నారని అందుకే వెనుకబడిన ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించకుండా గత 4 సంవత్సరాలుగా ప్రపంచస్థాయి రాజధాని అంటూ అమరావతి జపం చేస్తూ గాల్లో మేడలు కడుతూ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు.