సిఎం జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

RamaKrishna
RamaKrishna

హైదరాబాద్‌: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఏపి సిఎం జగన్‌కు లేఖ రాశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండల కేంద్రం నుంచి మహానంది మండలంలోని గాజులపల్లి వరకు చేపట్టిన యురేనియం డ్రిల్లింగ్ పనులు ఆపేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నాయా? ఒకపక్క యురేనియం ప్రమాదకరమని, ఆంధ్రా, తెలంగాణ ప్రజలు ఆందోళన చెందుతున్నారని, మరోపక్క ఏపీలో ఈవిధంగా డ్రిల్లింగ్ చేపట్టడం సరికాదని తన లేఖలో పేర్కొన్నారు. యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 29న విజయవాడలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/