ఏపిలోని జిల్లాల మధ్య అనుమతి అవసరం లేదు

తెలంగాణ సహా చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి ఏపిలోకి రావాలంటే మాత్రం అనుమతి

Goutam Sawang
Goutam Sawang

అమరావతి: ఏపిలో రాకపోకలకు అనుమతులు అవసరం లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అంటే ఓ జిల్లాలో వ్యక్తి మరో జిల్లాకు స్వేచ్ఛగా వెళ్లవచ్చు. అలాగే… తమ వాహనాల్ని కూడా తీసుకెళ్లవచ్చు. ఇందుకు ఎలాంటి అనుమతి పత్రాలూ చూపించాల్సిన అవసరం లేదు. జిల్లాల సరిహద్దుల్లో వాహనాలు ఆపవద్దని ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చినట్లు గౌతమ్ సవాంగ్ తెలిపారు. కాగా ఏపిలోని జిల్లాల మధ్య అనుమతి పత్రాలు లేవు గానీ… తెలంగాణ సహా చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి ఏపీలోకి రావాలంటే మాత్రం అనుమతి ఉండాల్సిందే. అక్కడ మాత్రం కండీషన్లు అమలవుతున్నాయి. ఓవైపు కరోనా కేసులు ఎత్తివేస్తున్నా… ప్రజలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిబంధనలను సడలిస్తోంది. అయితే కారుల్లో ముగ్గురికి మించకుండా ప్రయాణించవచ్చన్నారు. అలాగే… మాస్కులు ధరించడం, సోషల్ డిస్టాన్స్ పాటించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా అమలవుతున్నాయని తెలిపారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/