నేడు నింగిలోకి చంద్రయాన్‌-2

మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్‌-2

Chandrayaan 2
Chandrayaan 2

శ్రీహరికోట: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌2 ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో జీఎస్‌ఎల్‌వీమార్క్‌3ఎం1 వాహకనౌక(రాకెట్‌) ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకువెళ్లనుంది. ఈరోజు మధ్యాహ్నం సరిగ్గా 2.43 గంటలకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో ఉన్న రెండో ప్రయోగ వేదిక నుంచి చంద్రయాన్‌2 ప్రయోగం జరగనుంది. ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్డౌన్‌ ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 20 గంటల పాటు కొనసాగి జీఎస్‌ఎల్‌వీమార్క్‌3ఎం1 నింగిలోకి వెళ్లనుంది. వాహకనౌక 3.8 టన్నుల బరువుగల చంద్రయాన్‌2 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.ప్రయోగ వేదిక నుంచి రాకెట్‌ బయలుదేరిన తరువాత 16.13 నిమిషాలపాటు ప్రయాణించి, నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించిన పిదప చంద్రయాన్‌2 రాకెట్‌ నుంచి విడిపోతుంది.


తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/