రాజమండ్రి సెంట్రోల్‌ జైల్లో కరోనా కల్లోలం

ఇప్పటికే 28 మంది ఖైదీలకు పాజిటివ్..900 మంది ఖైదీల రిపోర్టులు రావాల్సి ఉంది

corona virus

రాజమండ్రి: ఏపిలో కరోనా వైరస్‌ కొనసాగుతుంది. తాజాగా రాజమండ్రి సెంట్రల్ మరో 10 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు 28 మంది ఖైదీలు దీని బారిన పడ్డారు. 900 మంది ఖైదీలకు కరోనా పరీక్షలను నిర్వహించారు. వీరి ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ సాయంత్రానికి టెస్టు రిపోర్టులు రావచ్చని అధికారులు చెపుతున్నారు. మరోవైపు, 200 మంది ఖైదీల వరకు కరోనా పాజిటివ్ వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ సాయంత్రం వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/