కరోనా పరీక్షలకు ధరలు నిర్ణయంచిన ప్రభ్వుతం

ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుకు రూ.750
ఆర్టీపీసీఆర్ టెస్టుకు రూ.2,800

corona test

అమరావతి: ప్రభుత్వం నుండి పంపే కరోనా నమూనాలు, ప్రైవేటుగా సేకరించే నమూనాల పరీక్షలకు ఏపి ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్ లలో ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలకు రూ.750 కంటే ఎక్కువ వసూలు చేయవద్దని ఆదేశించారు. ఆర్టీపీసీఆర్ విధానంలో చేసే పరీక్షకు రూ.2,800 ధరను నిర్ణయించారు. ర్యాపిడ్ కిట్, పీపీఈ కిట్లు, మానవ వనరుల వ్యయం అన్నీ కలుపుకునే ఈ ధరను నిర్ణయించినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రభుత్వంతో పాటు ఐసీఎంఆర్ కు కూడా పరీక్షల ఫలితాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ పద్ధతిలో, ఈ ధరలతో కరోనా పరీక్షలు చేయదలుచుకున్న ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు ల్యాబ్ లు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/