ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 13

రాష్ట్ర వ్యాప్తంగా 384 మందికి పరీక్షలు

people with masks
coronavirus in AP: Positive Cases 12

Amravati: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మరి విస్తరిస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా విస్తరణ పెరుగుతోంది.

శుక్రవారం ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విశాఖకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని దృవపడింది. దీంంతో ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్య 13కు పెరిగింది.   

రాష్ట్ర వ్యాప్తంగా 384 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా,  317 మందికి నెగెటివ్ గా తేలింది. మిగిలిన వారి రిపోర్టులు రావాల్సి ఉంది.

మరోవైపు తిరుపతిలోని ఇద్దరు స్విమ్స్ వైద్యులకు వైరస్ లక్షణాలు కనిపించడంతో వారి నమూనాలను సేకరించి ఇద్దరిని క్వారంటైన్ కు తరలించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/