కరోనా లక్షణాలున్నాయి.. తీసుకువెళ్లండి

కర్నూలులో సమాచారం ఇచ్చినా స్పందించని అధికారులు

corona virus
corona virus

కర్నూలు: జిల్లాలో ఇప్పటికే అత్యధిక కరోనా కేసులు నమోదు కావడంతో జిల్లా ప్రజలు భయంతో వణికి పోతున్నారు. జిల్లాలో వేగంగా కరోనా విజృంబిస్తుండడంతో ఎవరికయిన కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లాలని స్థానికులు అధికారులకు సమాచారాన్ని అందిస్తున్నారు. తాజాగా పాతబస్తి కురవవీధిలో ఒ యువకుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని కాలని వాసులు చెబుతున్నారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో ఉన్నాడని, అయితే అతని తండ్రికి జ్వరం, వాంతులు, తలనొప్పితో భాధపడుతున్నారని, ఆసుపత్రికి తీసుకువెళ్లమని అధికారులకు సమాచారం ఇచ్చిన స్పందించడంలేదని కాలని వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 234 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అందులోను కర్నూలు, నంద్యాల, నందికొట్కురు లో అధికంగా కరోనా కేసులు నమోదు అవుతుండడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/