తిరుమలపై కరోనా ప్రభావం

భారీగా తగ్గిపోయిన టిటిడి ఆదాయం

tirumala
tirumala

తిరుమల: కరోనా మహామ్మారి ప్రభావం ప్రపంచంలోని అన్ని మతాల పవిత్ర స్థలాలపై పడింది. దీని వల్ల వాటి ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతిరోజు వేలాది మందితో నిత్యం కిటకిటలాడే తిరుమల తిరుపతి దేవస్థానం కరోనా కారణంగా భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. టికెట్లు, హుండి, వసతి గదులు, ప్రసాదం, తలనీలాలు, దుకాణాలు, వంటి తదితర రూపాల్లో వచ్చే ఆదాయం భారీగా కోల్పోయింది. దీంతో టిటిడి 2020-21 బడ్జెట్‌ అంచనాలు మరిపోయే పరిస్థితి నెలకోంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో భక్తులను ఎవరిని అనుమతించడంలేదు. లాక్‌డౌన్‌ మరిన్ని రోజులు కొనసాగితే టిటిడి ఆదాయం భారీగా తగ్గిపోనుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/