కాళేశ్వరంతో ఎడారిలా ఏపి

కడప: కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏపి ఎడారిలా మారబోతుందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా తులసిరెడ్డి, మాజీ మంత్రి సాయిప్రతాప్ కేక్ కట్ చేశారు. కాళేశ్వరం ఆపాలని జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జలదీక్ష చేశారని తులసిరెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడేమో కాళేశ్వరం ప్రారంభోత్సవానికి వెళ్లాలనుకోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.
తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/nri/