నేడు ఏపి కాంగ్రెస్‌ జాబితా!

congress
congress


అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత కాంగ్రెస్‌ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటుకూడా గెలవలేకపోయింది. ఇక ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ నుంచి వలసలు ఆరంభమయ్యాయి. పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ స్పీడు పెంచింది. ఇప్పటికే అభ్యర్ధుల ఎంపిక కోసం దరఖాస్తులు కూడా స్వీకరించింది. అభ్యర్ధుల ఎంపికపై ఇన్ని రోజులు కసరత్తు చేసిన పిసిసి, నేడు జాబితాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు ఒకేసారి అభ్యర్ధులను ప్రకటించనున్నారని సమాచారం. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు సుమారు 1300 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.