కరోనా సమయంలో సభలు, సమావేశాలు

దీనిపై కేంద్ర హోం శాఖ కఠిన చర్యలు తీసుకోవాలి: అఖిల ప్రియ

akhila priya
akhila priya

కర్నూలు: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నప్పటికి ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నడుతు లాక్‌డౌన్‌ సమయంలో కూడా వైయస్‌ఆర్‌సిపి నాయకులు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారంటు ఏపి టిడిపి మహిళా నేత అఖిలప్రియ ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. దీనికి సంబందించి ఆ పార్టీనేతలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖను కోరారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కర్నూలు చాలా ప్రమాదంలో ఉంది. ప్రతిరోజు ప్రజలు చనిపోతున్నారు. చాలిమంది క్వారంటైన్‌కు వెలుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సభను జరపడానికిక నంధ్యాల ఎంపి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారు?. దీనిపై కేంద్ర హోంశాఖ సహయ మంత్రి గారు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అంటూ. ఇటీవల వైయస్‌ఆర్‌సిపి నేతలు నిర్వహించిన ఒ సమావేశం ఫోటోను ఆమె పోస్ట్‌ చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/