అట్టహాసంగా వైయస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం

YS Jagan

Vijayawada: : నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇంటి నుంచి విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియానికి వచ్చిన వైయస్‌ జగన్‌ ముందుగా టాప్‌ లెస్‌ కార్‌లో అభివాదం చేశారు. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన  ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేశారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అనే నేను… అంటూ దైవసాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం గవర్నర్, తెలంగాణ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్, వైయస్‌ఆర్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ, వైయస్‌ షర్మిల, భారతి, కేవీపీ, తదితరులు వైయస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నవరత్నాల పథకాలపై వైయస్‌ జగన్‌ మొదటి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, డీఎంకే అధినేత స్టాలిన్, కాంగ్రెస్‌ నేత కేవీపీ, వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.