నేడు కర్నూలులో సీఎం పర్యటన

Amaravati: పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్..
‘డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు’ మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 
నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా హెల్త్‌ సబ్‌ సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
జగన్ పర్యటన ఇలా..
ఉదయం 9 గంటలకు విజయవాడలోని తన నివాసం నుంచి బయలుదేరి 9:20కి గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. 
9:30 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 10:30 ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుంటారు. 
10:35 గంటలకు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నగరంలోని ఎస్‌ఏపీ క్యాంప్‌లోని ఏపీఎస్పీ బెటాలియన్ చేరుకుంటారు.
10:45 గంటలకు జిల్లా మంత్రులు, వైసీపీ నాయకులు, అధికారులు స్వాగతం పలుకుతారు. 
10:50 గంటలకు ఎస్‌ఏపీ క్యాంప్ నుంచి బయలుదేరి 11 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానం చేరుకుంటారు.
11:00 గంటల నుంచి 11:20 గంటల వరకు ‘డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు’ మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా హెల్త్‌ సబ్‌ సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
11:20 గంటలకు నుంచి 12:50 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.
12:50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1:00 గంటలకు ఏపీఎస్‌పీ బెటాలియన్‌కు చేరుకుంటారు.
1:10 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 1:20 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు.
1:30 నుంచి గంటలకు ఓర్వకల్లు విమానాశ్రమం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 2:30కి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
2:40 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి 3 గంటలకు తన నివాసం చేరుకుంటారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/