సచివాలయ ప్రవేశాన్ని వాయిదా వేసుకున్న సిఎం

cm Jagan
cm Jagan

అమరావతి: ఏపి సిఎంగా జగన్‌ నిన్న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన పరిపాలన కార్యక్రమాలు మొదలు పెట్టారు. పెన్షన్ ఫైలుపై తొలి సంతకం చేసిన ఆయన దానికి సంబంధించి జీవోను కూడా తీసుకువచ్చారు. కాగా ఈరోజు సిఎం జగన్‌ వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో అడుగుపెట్టి అక్కడి నుంచే పాలన మొదలుపెట్టాలని భావించారు. కొన్ని శాఖలకు సంబంధించి సమీక్షలు నిర్వహించాలని అనుకున్నారు. అయితే, సుముహూర్తం లేకపోవడంతో ఆయన తన నిర్ణయాన్ని వాయిదావేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటివద్ద నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/