సంపద సృష్టించడం సులువు కాదని సిఎం గ్రహించాలి

panchumarthi anuradha
panchumarthi anuradha

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ టిడిపి మహిళా నేత పంచుమర్తి అనురాధ వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో ప్రభుత్వ ఆస్తులు అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అదే జరిగితే టిడిపి చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. ప్రభుత్వం ఆస్తులు అమ్మే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అనురాధ స్పష్టం చేశారు. మిషన్‌ బిల్డ్‌ పేరిట రాష్ట్రాన్ని అమ్మకానికి పెడుతున్నారని, ఇది మిషన్‌ బిల్డ్‌ కాదని, మరో క్విడ్‌ ప్రోకో అని ఆరోపించారు. ఇంకా అనురాధ మాట్లడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సంపద సృష్టించడం రాకపోతే చంద్రబాబు వద్ద క్లాసులు తీసుకోవాలని హితవు పలికారు. రాజధాని కోసం రూ.2లక్షల కోట్ల సంపదను చంద్రబాబు సమకూర్చితే దాన్ని వల్లకాడులా మార్చేశారంటూ విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంపదను సృష్టించడం ఎంత కష్టమో సీఎం జగన్‌ గ్రహించాలని వ్యాఖ్యానించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/