సిఎం జగన్‌ నివాసం పరిసరాల్లో నిషేదాజ్ఞలు

cm jagan
cm jagan

తాడేపల్లి: ఏపి సిఎం జగన్‌ తాడేపల్లిలోని నివాసం పరిసరాల్లో పోలీసు చట్టం అమల్లో ఉంది. అయితే సిఎం జగన్‌ నివాసాన్ని రేషన్‌ డీలర్లు ఈరోజు ముట్టడిస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాడేపల్లిలో ఆందోళనలు నిర్వహించవద్దని అన్నారు. పోలీసుల అనుమతి లేకుండా ఆందోళనలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవనిఅర్బన్ ఎస్పీ రామకృష్ణ తెలిపారు. కాగా ఇప్పటికే జగన్ నివాసం వద్ద డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నిరంతర పరిశీలన, భద్రతా బలగాలతో పాటు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/