అవినీతి లేని పారదర్శక పాలన అందించలి

cm jagan
cm jagan

అమరావతి: తొలి సారిగా సచివాలయంలోని తన ఛాంబర్‌లో అడుగుపెట్టిన సీఎం పలు కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు. అనంతరం సచివాలయం మొదటి బ్లాక్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ..
మన పాలన దేశానికే ఆదర్శంగా ఉండాలని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘‘అవినీతికి ఆస్కారంలేని పారదర్శక పాలన అందించడానికి ధృడ సంకల్పంతో ఉన్నాం. అనేక సవాళ్లను సైతం ఎదుర్కొని మంచి పనితీరు ప్రదర్శించే ప్రతిభ అధికారులకు ఉంది. అధికారులు తమకున్న పూర్తి అవగాహనతో సహకరించాలి. మీరు పూర్తిగా  సహకరిస్తే ప్రజలు, ప్రభుత్వం కల నెరవేరుతుంది. మంచి పనితీరు కనబరిచే అధికారులను సత్కారాలతో గౌరవిస్తాం. చేసే పనులు మీ ముందు ఉంచుతామని సీజేకు చెప్పా. న్యాయమైన నిర్ణయం జ్యుడీషియల్‌ కమిషన్‌ తీసుకోవాల్సిందిగా కోరా. గతంలో కాంట్రాక్టులు అంటే కేవలం తమకు అనువైన వారికే ఉండేవి.  ఇక ఆ పరిస్థితి తలెత్తకుండా రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తాం’’ అని సీఎం వివరించారు.