ఏపికి బయలుదేరిన సియం కేసిఆర్‌

KCR, TS CM
KCR, TS CM

హైదరాబాద్‌: సియం కేసిఆర్‌ ఏపికి బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసిఆర్‌ విజయవాడకు బయలుదేరారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సియం కేసిఆర్‌..ఏపి సియం జగన్‌ను ఆహ్వానించనున్నారు. కేసిఆర్‌ వెంట కేటిఆర్‌, రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌ కుమార్‌, మాజీ ఎంపి వినోద్‌, ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డిలు ఉన్నారు.
ఈ నెల 21న తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సియం కేసిఆర్‌ చేతుల మీదుగా జరగనుంది. ఈ ప్రాజెక్టుకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని మహారాష్ట్ర సియం ఫద్నవీస్‌ను సియం కేసిఆర్‌ ఇంతకు ముందే ఆహ్వానించిన సంగతి విదితమే.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/