కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలి

కరోనాపై సిఎం జగన్ సమీక్ష..వైద్య సిబ్బందికి శిక్షణ ఎంతో ముఖ్యమన్న సిఎం

AP CM Jagan
AP CM Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) పై సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో కరోనా బాధితుడ్ని గుర్తించిన నేపథ్యంలో, ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ఓ కరోనా కేసు నమోదైందని, ఏపీలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. అయితే ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా, కరోనాను ఎదుర్కోవడంలో వైద్య సిబ్బందికి శిక్షణ అత్యావశ్యకమని సీఎం అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన కలిగించాలని సూచించారు. కరోనా వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకోకుండా, ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. బాడీ మాస్కులు, మౌత్ మాస్కులు సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/