నేడు రవాణా శాఖపై జగన్ సమీక్ష

cm jagan
cm jagan

అమరావతి: ఏపి ప్రభుత్వం మరో కీలక అడుగు వేయబోతోంది. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సన్నాహకాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా విలీన ప్రక్రియ కోసం వేసిన కమిటీ తన మధ్యంతర నివేదికను నేడు ముఖ్యమంత్రి జగన్ కు అందించనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు రవాణా శాఖపై జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని గతంలోనే జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 1958లో ఏపీఎస్ ఆర్టీసీ ప్రస్థానం ప్రారంభమైంది. ప్రస్తుతం ఆర్టీసీకి 128 డిపోలు ఉండగా… 52 వేల మంది సిబ్బంది పని చేస్తున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/