వ్యవసాయశాఖపై సిఎం జగన్‌ సమీక్ష

cm jagan
cm jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ వ్యవసాయశాఖపై సమీక్ష ప్రారంభమైంది. ఈ సమీక్ష దాదాపు గంటకు పైగా జరిగే అవకాశలున్నాయి. ఈ సమావేశంలో ముఖ్యంగా ఖరీఫ్‌ సీజన్‌, మద్దతు ధరలు, రైతు రుణాలు, సబ్సిడీలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లం, స్పెషల్‌ సీఎస్‌ పీవీ రమేష్‌, వ్యవసాయశాఖ సలహాదారు విజయకుమార్, ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు. కాగా ఈరోజు సిఎం జగన్‌ దీంతోపాటు మధ్యాహ్నం జలవనరుల శాఖపై ఉన్నతాధికారులతో వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పోలవరం ప్రస్తావన రానుందని తెలుస్తోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/