చిన్నారి కళ్లకు క్యాన్సర్‌ వార్తల పై స్పందించిన సిఎం

క్యాన్సర్‌తో కళ్లు కోల్పోయిన చిన్నారి

cm jagan
cm jagan

అమరావతి: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని కడియపులంక గ్రామం దోశాలమ్మకాలనీలో కళ్లకు క్యాన్సర్‌ సోకిన చిన్నారి హేమ (4) అనారోగ్యంపై వార్తా పత్రికల్లో ఇటీవల హేమ పరిస్థితిపై కథనాలు వచ్చినా వార్తల పై సిఎం జగన్‌ స్పందించారు. జగన్.. వారి కుటుంబ వివరాలన్నీ తెలుసుకొని, సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. నిరుపేదలను ఆదుకునేందుకు ఆరోగ్యశ్రీలో భారీ సంస్కరణలకు నిర్ణయం తీసుకున్నట్లు జగన్ తెలిపారు. క్యాన్సర్‌ రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఎన్ని విడతలైనా, ఏ పరిమితులు లేకుండా చికిత్స చేయాలని జగన్ సూచించారు. జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీ పూర్తి స్థాయి సంస్కరణలతో అమలు అవుతుందని, ఈ లోగా అత్యవసర కేసులుంటే చికిత్సలు అందించాలని సిఎం జగన్‌ చెప్పారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/