పలాసలో కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన

cm jagan
cm jagan

కాశీబుగ్గ: ఏపి సిఎం జగన్‌ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కాశీబుగ్గ రైల్వే మైదానంలోని సభా ప్రాంగణంకు చేరుకున్నారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన పలుఅభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలకాలను సిఎం ఆవిష్కరించారు. ఉద్దానం ప్రాంతంలోని ప్రజలకు రూ.600 కోట్లతో నిర్మించనున్న పరిశుభ్రమైన తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు, పలాసలో రూ.50కోట్లతో నిర్మించనున్న రెండు వందల పడకల కిడ్నీ సూపర్‌ స్పెషాల్లీ ఆసుపత్రితో పాటు కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌కు, వజ్రపుకొత్తూరూ మండలం మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం రూ.11 కోట్ల 95 లక్షలతో నిర్మించనున్న జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన సిఎం జగన్‌ చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కిడ్నీ వ్యాధితో సతమతమవుతున్న రోగుల్లో స్టేజ్‌-3 బాధితుల నుంచే ఐదు వేల రూపాయలు పెన్షన్ అందించనున్నట్లు ప్రకటించారు. ‘ఇప్పటి వరకు స్టేజ్‌-5 నుంచి బాధితులకు ప్రభుత్వం రూ.10 వేల ఆర్థిక సాయం ప్రకటించింది. అయితే మీ ఎమ్మెల్యే (పలాస శాసన సభ్యుడు) స్టేజ్‌-3 నుంచే బాధితులు భారీ మొత్తంలో మందుల కోసం ఖర్చు చేయాల్సి ఉన్నందున, వారిని ఆర్థికంగా ఆదుకోవాలని నా దృష్టికి తెచ్చారు. ఆయన సూచన మేరకు స్టేజ్‌-3 నుంచి కూడా బాధితులకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వనున్నట్లు  ప్రకటిస్తున్నా’ అంటూ సభాముఖంగా తెలిపారు. అదే విధంగా  రోగులకు, వారి సహాయకులకు ఉచిత బస్‌పాస్‌ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను కూడా శరవేగంగా పూర్తిచేసి రైతులకు ప్రయోజనం సత్వరం అందేలా చూస్తామని తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/