ఐపీఎస్‌, ఐఏఎస్‌లతో సమావేశమైన సిఎం జగన్‌

ap cm jagan
ap cm jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఈరోజు ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులతో సమావేశమయ్యారు. సిఎంతో గౌతమ్‌ సవాంగ్‌ భేటీ అయ్యారు. అయితే ఈ భేటి మరో అరగంటకు పైగా జరిగే అవకాశముంది. ఈ భేటి తరువాత సవాంగ్‌ మీడియాతో మాట్లాడుతారని సమాచారం. ఇన్‌చార్జ్‌ డీజీపీగా గౌతం సవాంగ్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం గురువారం రాత్రే ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా గౌతం సవాంగ్‌కు డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ను స్టేషనరీ అండ్‌ ప్రింటింగ్‌ కమిషనర్‌గా బదిలీ చేసిన విషయం తెలిసిందే.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/