తిరుపతికి బయల్దేరిన సిఎం జగన్‌

ముగిసిన ఢిల్లీ పర్యటన

Prajavedhika Contruction Report to CM jagan
CM jagan

న్యూఢిల్లీ: ఏపి సిఎం జగన్‌ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీ నుంచి నేరుగా ఆయన తిరుపతికి బయల్దేరారు. శ్రీవారి సాలకట్ల బ్రహోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.00 గంటకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. రేణిగుంట నుంచి రోడ్డుమార్గంలో తిరుమల శ్రీ పద్మావతి అతిధి గృహం చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 5.27 గంటలకు పద్మావతి గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి అన్నమయ్య భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడితో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. సాయంత్రం 6.15 గంటలకు బేడి ఆంజనేయ స్వామి ఆలయం చేరుకుని అక్కడి నుండి శ్రీవారి ఆలయానికి చేరుకుని ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని రాత్రి 7.40 గంటలకు శ్రీ పద్మావతి అతిధి గృహం చేరుకుని రాత్రి బస చేస్తారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/