తిరుపతికి బయలుదేరిని సిఎం జగన్‌

Jagan
Jagan

విజయవాడ: ఏపి సిఎం జగన్‌ తిరుపతికి బయల్దేరారు. గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో ఆయన రేణిగుంట చేరుకోనున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈరోజు సాయంత్రం తిరుపతికి రానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు సీఎం జగన్ తిరుపతికి వెళ్లారు. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ఇప్పటికే గవర్నర్ నరసింహన్ తిరుపతి చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్ సాయంత్రం తిరిగి విజయవాడ చేరుకోనున్నారు.


తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/tours/