రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన సిఎం జగన్‌, చంద్రబాబు

Chandrababu , YS Jagan
Chandrababu , YS Jagan

అమరావతి: ఈరోజు రంజాన్‌ పండుగ సందర్భంగా ఏపి సిఎం జగన్‌ ముస్లిం సోదరులకు రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినం నేపథ్యంలో అందరి కుటుంబాలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు సిఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.
మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబు కూడ సత్ప్రవర్తన, నియమనిష్టలతో కూడిన జీవనవిధానానికి మార్గం చూపిన ఖురాన్ ఆవిష్కృతమైన పవిత్ర మాసం రంజాన్. నెలరోజుల ఉపవాస దీక్షలు ముగించుకుని ఈరోజు పండుగ చేసుకుంటున్న ముస్లిం సోదరులకు ఈత్‌ ముబారక్‌ అని ట్వీట్‌ చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/