మంత్రి కెటిఆర్‌కు సిఎం జగన్‌ శుభాకాంక్షలు

cm-jagan-birth-day-wishes-to-minister-ktr

అమరావతి: నేడు మంత్రి కెటిఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా సిఎం జగన్‌ ట్విట్టర్ వేదికగా కెటిఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘సోదరుడు కెటిఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలి’ అని ట్విట్టర్ వేదికగా జగన్‌ ఆకాంక్షించారు. ఈ ట్వీట్‌కు కేటీఆర్, వైఎస్ జగన్ అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తూ లైక్‌లు, షేర్‌లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా కెటిఆర్‌కు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు, కార్యకర్తలు ఆయనకు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/