వాలంటీర్ల విధులు, సంక్షేమ పధకాలపై సీఎం ప్రకటించిన షెడ్యూల్‌

cm Jagan
cm Jagan


అమరావతి: వాలంటీర్లు ఆగస్టు 16వతేదీ నుంచి 23 వరకు వారికి కేటాయించిన కుటుంబాలను పరిచయం చేసుకుంటారు.– ఆగస్టు 26 నుంచి 30 వరకు ఇళ్ల స్థలాల కోసం సర్వే చేయడంతోపాటు  లబ్ధిదారులను గుర్తిస్తారు.– సెప్టెంబరు 1 నుంచి సెప్టెంబరు 10 వరకు బియ్యం, పెన్షన్లు డోర్‌ డెలివరీ చేస్తారు.– పైలట్‌ ప్రాజెక్టుగా నాణ్యమైన, ప్యాకింగ్‌ చేసిన బియ్యం పంపిణీని శ్రీకాకుళం నుంచి ప్రారంభిస్తారు. – ఈ ఏడాది చివరి నాటికి అన్ని జిల్లాలో నాణ్యమైన, ప్యాకింగ్‌ చేసిన బియ్యం పంపిణీ.– సెప్టెంబరు 11 నుంచి 15 వరకు పెన్షన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, రైతు భరోసా లబ్ధిదారులను వలంటీర్లు గుర్తిస్తారు.– ఎవరికైనా అందకపోతే వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తారు.– మత్స్యకారులు, రజకులు, ఆటోడ్రైవర్లు, దర్జీలు, నాయీ బ్రాహ్మణులకు సంబంధించిన పథకాలకు అర్హులను కూడా వలంటీర్లు గుర్తిస్తారు. 

సెప్టెంబరు 15 నుంచి 30 వరకు గ్రామ వాలంటీర్లకు శిక్షణ ఉంటుంది.– సెప్టెంబరు 29న గ్రామ సచివాలయ ఉద్యోగులకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు జారీ.– అక్టోబరు 2 నాటికి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయి.– అక్టోబరు 3 నుంచి 30 వరకూ గ్రామ సచివాలయ ఉద్యోగులకు విడతల వారీగా శిక్షణ.– దరఖాస్తు అందిన 72 గంటల్లోగా పరిష్కారం అయ్యేలా సచివాలయాలు కృషి చేస్తాయి:– గ్రామ సచివాలయంలో ప్రతివారం స్పందన కార్యక్రమం నిర్వహణ– గ్రామ వలంటీర్ల ద్వారా కానీ, నేరుగా గానీ ప్రజల నుంచి అందే వినతులు స్వీకరించాలి.– వినతులు తీసుకోగానే వాటికి రశీదు ఇవ్వాలి– ప్రస్తుతం స్పందన కార్యక్రమంలో అనుసరిస్తున్న మార్గదర్శకాలను గ్రామ సచివాలయాలు కూడా పాటించాలి– పెన్షన్లు, రేషన్‌ కార్డులు తదితరాలు 72 గంటల్లోగా ప్రింట్‌ చేసి ఇచ్చే స్థాయికి చేరుకోవాలి– గ్రామ సచివాలయంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించాలి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/