ఈసీ పనితీరుపై మండిపడ్డా సిఎం

AP CM Chandrababu
AP CM Chandrababu

అమరావతి: సిఎం చంద్రబాబు ఏపిలో పోలింగ్‌ ముగిసిన తరువాత ఈసీ పనితీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కెసిఆర్‌, జగన్‌ చెబితే ఈసీ పాటిస్తుందన్నారు. వాళ్లు ఎవరిని బదిలీ చేయమంటే వాళ్లను బదిలీ చేశారని చెప్పారు. ఈవీఎంలను రిపేర్‌ చేస్తామని చెప్పి ట్యాపరింగ్‌ చేశారన్నారు. ఈవీఎంలు పనిచేయకపోవడంతో నానా ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రజలు దృఢ సంకల్పంతో ఓటేయడానికి వచ్చారన్నారు. ఇంతమందిని అంత ఉదయమే ఎప్పుడైనా చూశామా? అని అడిగారు. ఈవీఎంలు పనిచేయకపోతే మూడుసార్లు వెళ్లి మళ్లీ వచ్చారని స్పష్టంచేశారు. సీఈవోనే ఓటు వేయలేకపోయారని ఎద్దేవాచేశారు. సీఈవోనే ఓటేయలేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. ఇష్టమొచ్చినట్లు ఈవీఎంలు రీప్లేస్ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల భవిష్యత్‌ని ఒక మిషన్‌ మీద వదిలిపెట్టారన్నారు. ఒంటిగంటకు పోలింగ్ ప్రారంభించి సాయంత్రం 6 గంటలకు ముగిస్తారా? అంటూ ధ్వజమెత్తారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్త కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/