అందరి అభిప్రాయాలు సేకరించి అభ్యర్థులను ప్రకటించాం

AP CM Chandrababu Naidu
AP CM Chandrababu Naidu

అమరాతి: కార్యకర్తలు, ప్రజల అభీష్టం మేరకే రాగ ద్వేషాలకు అతీతంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన ఈరోజు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భావితరాలకు ఉపయోగపడే ప్రజా ఉద్యమంగా ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగాలనిచంద్రబాబు ఆకాంక్షించారు.అందరి అభిప్రాయాలు సేకరించి అభ్యర్థులను ప్రకటించడం చరిత్రలో ఇదే తొలిసారి అని అభివర్ణించారు.టికెట్‌ రాని వారెవ్వరూ నిరాశ చెందొద్దని, అందరి సేవలూ గుర్తించి పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని భరోసా ఇచ్చారు. రానున్న రోజుల్లో తగిన ప్రాధాన్యం అందరికీ కల్పించే బాధ్యత తనదని స్పష్టం చేశారు. ప్రకటించిన అభ్యర్థులందరినీ కార్యకర్తలు ఆశీర్వదించాలని అధినేత కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలను కలుసుకోకుండా వెళ్తే తీవ్ర పరిణామాలుంటాయని నేతలను హెచ్చరించారు. జరిగేవి ప్రజా ఎన్నికలని, వారి మనోభావాలకు తగ్గట్టే అభ్యర్థులను ఖరారు చేశామన్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/