ఏపి ప్రజలకు సిఎం చంద్రబాబు విజ్ఞప్తి

ap cm chandrababu
ap cm chandrababu

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలలు పనిచేయలేదని ఓటర్లు వెనుదిరగడం దురదృష్టకరమన్నారు. వెళ్లినవాళ్లు తిరిగివచ్చి ఓటు వేయాలని చంద్రబాబు కోరారు. అంతేకాక ఎవరికి ఓటు పడిందో కూడా వీవీ ప్యాట్‌లో చెక్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రజాస్వామ్య భవనానికి ఓటర్లు ఇటుకల లాంటివారని, ఇటుకలు బలంగా ఉంటేనే భవనం పదికాలాలు భద్రంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలంతా నిర్భయంగా ఓటేయాలని ట్విట్టర్‌లో చంద్రబాబు పిలుపునిచ్చారు. చాలాచోట్లు పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఓటర్లు ఆందోళనకు దిగుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు ధర్నాకు దిగారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/