చింతమనేని జైలు నుంచి విడుదల

Chintamaneni Prabhakar
Chintamaneni Prabhakar

ఏలూరు: టిడిపి నేత చింతమనేని ప్రభాకర్‌ నేడు జైలు నుంచి విడుదల అయ్యారు. ఆయనకు నిన్న కోర్టులో బెయిల్‌ మంజూరు అయిన విషయం తెలిసిందే. కాగా కులం పేరుతో దూషించారన్న అభియోగంతో ఆగస్టులో పెదపాడు పోలీసు స్టేషన్‌లో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అంతేకాకుండా పలు రకాల కేసుల్లో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని ఏలూరు జిల్లా జైలులో రిమండ్‌కు తరలించారు. ఆయనకు ఇప్పటికే 14 కేసుల్లో బెయిల్‌రాగా నిన్న మరో నాలుగు కేసుల్లో బెయిల్‌ మంజూరు అయింది. కాగా మరోవైపు చింతమనేని అభిమానుల, కార్యకర్తలు ఆయన విడుదల తర్వాత భారీ ర్యాలీ నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. కానీ దీనికి ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదంటూ పోలీసులు ఆయనకు సంబంధించిన పోస్టర్లను కూడా తీయించివేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/