చెవిరెడ్డికి రెండు ప‌ద‌వులు!

Chevireddy Bhaskar Reddy
Chevireddy Bhaskar Reddy

చిత్తూరు: మంత్రి పదవి ఆశించి భంగపడ్డ చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి కీలక పదవి దక్కింది. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(తుడా) చైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియమితులు కాబోతున్నారు. సీఎం జగన్ ఈ మేరకు చెవిరెడ్డికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే చెవిరెడ్డి గతంలో కూడా తుడా చైర్మన్‌గా పనిచేశారు. ప్రభుత్వ విప్‌గా కూడా చెవిరెడ్డి వ్యవహరించనున్నారు. జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి కచ్చితంగా దక్కుతుందని చెవిరెడ్డి భావించారు. అయితే.. చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరికి జగన్ అవకాశం కల్పించారు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామికి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ కేబినెట్‌లో చోటు దక్కింది.