డాక్టర్ సుధాకర్ కు చికిత్స అందించే వైద్యుడి మార్పు

డాక్టర్‌ రామిరెడ్డి స్థానంలో మహిళా వైద్యురాలి నియామకం

Change of doctor who treats Dr. Sudhakar
Change of doctor who treats Dr. Sudhakar

Visakhapatnam: డాక్టర్‌ సుధాకర్‌కు చికిత్స అందిస్తున్న  వైద్యుడిని అధికారులు మార్చారు. మెంటల్‌ కేర్‌ ఆసుపత్రి డాక్టర్‌ రామిరెడ్డి స్థానంలో మహిళా వైద్యురాలిని నియమించారు.

డాక్టర్‌ రామిరెడ్డిపై ఆరోపణల నేపథ్యంలో మహిళా వైద్యురాలు డాక్టర్‌ మాధవీలతకు బాధ్యతలను అప్పగించారు. మరోవైపు డాక్టర్‌ సుధాకర్‌ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.

కరోనా చికిత్స చేస్తున్న వైద్యులకు సరైన మాస్కులు కూడా అందించడం లేదంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసిన డాక్టర్ సుధాకర్  సస్పెండైన సంగతి విదితమే.

ఆ తరువాత ఆయన అరెస్టు అయ్యారు. ఆయన మానసిక స్థితి సరిగా లేదంటూ మానసిక వైద్యానికి తరలించారు.

అయితే ప్రభుత్వం కక్ష సాధింపుతోనే ఇదంతా చేస్తున్నదని ఆరోపణలు వెల్లువెత్తాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/