చంద్రయాన్‌-2 భూ కక్ష్యను పెంచే రెండో ప్రక్రియ విజయవంతం

Chandrayaan-2
Chandrayaan-2

శ్రీహరికోట: చంద్రయాన్‌-2 వాహకనౌక భూ కక్ష్యను పెంచే రెండో ప్రక్రియ కూడా విజయవంతమైంది. బుధవారం మధ్యాహ్నం మొదటి భూ కక్ష్యను పెంచగా ఈరోజు తెల్లవారుజామున 1.08 నిమిషాలకు రెండోసారి కక్ష్యను పెంచారు. అయితే మూడోసారి కక్ష్యను పెంచే ప్రక్రియను జూలై 29న మధ్యాహ్నం చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆగస్టు 14 వరకు ఇలా కక్ష్యలు పెంచే ప్రక్రియను చేపడతామని ఇస్రో వెల్లడించింది. దీంతో ప్రస్తుతం చంద్రయాన్‌2 వాహకనౌక 251ు56829 కిలోమీటర్ల ఎత్తున ఉన్న భూ కక్ష్యలోకి చేరింది. ఆన్‌బోర్డులో ఉన్న ఇంధనాన్ని883 సెకెన్లపాటు మండించడం ద్వారా విజయవంతంగా కక్ష్యను పెంచినట్లు ఇస్రో వెల్లడించింది. వాహకనౌక పరామితులన్నీ సరిగా ఉన్నట్లు పేర్కొంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/