భూకక్ష్యను దాటిన చంద్రయాన్2

Chandrayaan -2
Chandrayaan -2


శ్రీహరి : భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్2 ఉపగ్రహం ఈ తెల్లవారుజామున భూకక్ష్యను విడిచిపెట్టింది. మరో వారం రోజుల్లో చంద్రుడి కక్ష్యలో ప్రవేశించనుంది. ఈ ఉదయం ఇస్రో చేపట్టిన కీలక ప్రక్రియ ద్వారా వ్యోమనౌక భూ కక్ష్యను పూర్తిగా విడిచిపెట్టింది. మరో ఆరు రోజుల్లో ఇది చంద్రుడి కక్ష్యను చేరుకుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి గత నెల 22న చంద్రయాన్2 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టారు. ఈ నెల 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనున్న వ్యోమనౌక వచ్చే నెల 7న చంద్రుడిపై కాలు మోపనుంది. భూ కక్ష్యను దాటించేందుకు ఈ ఉదయం ఇస్రో చేపట్టిన కీలక ప్రక్రియ విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/