చంద్రబాబు తీరు ఆశ్చర్యకరంగా ఉన్నది!

cm jagan
cm jagan

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో 2430 జీవో కుదిపేస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరుగుతోంది. మీడియా స్వేచ్ఛను హరించేలా ఈ జీవోను తీసుకొచ్చారని వెంటనే జీవోను రద్దు చేయాలని టిడిపి డిమాండ్‌ చేసింది. మీడియాకు సంకెళ్లు వేసి ఈ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. టిడిపి సభ్యుల విమర్శలపై సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ప్రతిపక్షనేత చంద్రబాబు తీరు ఆశ్చర్యకరమన్నారు. జీవోను చంద్రబాబు పూర్తిగా చదివారా అని ప్రశ్నించారు. లేదా ఇంగ్లీష్‌ అర్థం చేసుకోవడంలో లోపం ఉందా అని ఘాటుగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా జీవోను సీఎం జగన్‌ చదివి వినిపించారు. నిరాధార వార్తలు రాసిన వారిపై ఫిర్యాదు చేసే అధికారం సంబంధిత శాఖలకు ఈ జీవో ద్వారా ఇచ్చామన్నారు. ఈ జీవోను తప్పుబట్టేందుకు అవకాశమే లేదన్నారు. ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఇంగితజ్ఞానం కూడా లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/