ప్రత్యక్ష ప్రసారం నిలిపివేతపై ఆగ్రహం

ప్రజలు వ్యతిరేకిస్తుండడంతో ముఖం చూపలేక పిరికిపంద చర్య అని వ్యాఖ్య

Chandrababu Naidu
Chandrababu Naidu

అమరావతి: ఏపి సిఎం జగన్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ టిడిపి అధినేత చంద్రబాబు ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ఏపి ప్రజలు వ్యతిరేకిస్తుండడంతో పిరికింద వైఎస్‌ఆర్‌సిపి ముఖం చూపించుకోలేకపోతోందని, శాసనమండలి సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేయడమే అందుకు నిదర్శనమని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. నిలిపివేసిన లైవ్ టెలికాస్ట్ ను వెంటనే పునరుద్ధరించాలని, వికేంద్రీకరణ బిల్లును రద్దు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘షేమ్‌ ఆన్‌ వైఎస్‌జగన్‌’ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పోస్టు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/