చంద్రబాబు నోరు విప్పడం లేదు

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నోరు విప్పడం లేదని వెస్సార్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. చంద్రబాబు మాజీ పీఏతో పాటు ఆయన పెంచి పోషించిన అవినీతి సర్పాలపై జరుగుతున్న ఐటీ సోదాలపై చంద్రబాబు నాయుడు నోరువిప్పడం లేదని విమర్శించారు. నిప్పు కణికల్లాంటి వారిపై ఈ దాడులేంటని ఐటీ శాఖను నిలదీయాలి కానీ రేండ్రోజులుగా కిక్కురమనకుండా, కియా లేచిపోతోందని ఫేక్‌ వార్తలతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/