ప్రజలకు బహిరంగ లేఖ రాసిన చంద్రబాబు

కరోనా పరిస్థితులపై వివరణ

chandrababu naidu
chandrababu naidu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగలేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయిని, కేవలం వారం రోజుల వ్యవధిలో కేసుల సంఖ్య రెట్టింపు అయిందని అన్నారు. కరోనా వ్యాప్తి ని అరికట్టడానికి తాము ముందునుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నప్పటి, తమ సూచనలను ప్రభుత్వ పట్టించుకోవట్లేదని అన్నారు. రెడ్‌ జోన్‌ పరిధిలో వైయస్‌ఆర్‌సిపినేతలు నిబంధనలు పాటించట్లేదని, అధికార నేతల నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతూన్నయన్నారు. ప్రస్తుత పరిస్థితి గురించి జగన్‌ చేస్తున్న వాఖ్యలు ఆవేదనకు గురిచేస్తున్నాయన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా అనేక రంగాల వారు ఉఫాధికోల్పోయారని, రైతులు పంటలను రోడ్డుపాలు చేస్తున్నారన్నారు. రైతులను ఆదుకోవాలని, పంటలను కొనాలని, ప్రభుత్వానికి సూచించినప్పటికి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. రాష్ట్రంలో కరోనా కంటే స్థానిక ఎన్నికలే ముఖ్యంగా అధికార నేతలు ప్రవర్తిస్తున్నారని, రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఉన్నప్పటికి మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయన్నారు. ప్రజలు కూడా కరోనా కట్టడికి తమ వంతుగా కృషి చేయాలని, ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తు, మాస్కులు ధరించాలని అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/