ఏపి ప్రభుత్వానికి చంద్రబాబు హెచ్చరిక

chandrababu
chandrababu

అమరావతి: టిడిపి రాష్ట్రంలో ఇసుక కొరత నెలకొందంటూ తీవ్రస్థాయిలో నిరసన గళం విప్పిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ అంశంపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. దేన్నయినా సహిస్తాం కానీ, పేదల జోలికి వస్తే మాత్రం ఖబడ్దార్ అంటూ ఏపీ సర్కారును హెచ్చరించారు. పేదలకు అన్యాయం జరుగుతుంటే టిడిపి చూస్తూ ఊరుకోదని ట్వీట్ చేశారు. ఇసుక కొరత కారణంగా లక్షల మంది పేదవాళ్ల ఉపాధి మార్గాలను కూల్చివేశారని, ఆఖరికి వాళ్ల ఇళ్లను కూడా కూల్చివేసి నిలువ నీడలేకుండా చేస్తారా? అంటూ మండిపడ్డారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/