తూర్పు గోదావరిలో చంద్రబాబు పర్యటన

ap cm chandrababu
ap cm chandrababu

తూర్పుగోదావరి: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు, రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన చంద్రబాబు జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు కాకినాడలో జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. మధ్యాహ్నం నుంచి నియోజకవర్గాల నేతలతో విడివిడిగా సమీక్షలు నిర్వహించనున్నారు. ఇవాళ రంపచోడవరం, అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం గ్రామీణం, రాజోలు, పి.గన్నవరం, అమలాపురం, కొత్తపేట స్థానాల నేతలతో చంద్రబాబు విడివిడిగా సమావేశం కానున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/